ప్రొద్దుటూరు 1టౌన్ ఎస్సై శ్రీనివాసులుకు సన్మానం.!
ప్రొద్దుటూరు(ఆగస్ట్, 13): ప్రొద్దుటూరు 1-టౌన్ ఎస్సై శ్రీనివాసులు కమలాపురం బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా సీఐ కొండారెడ్డి, ఎస్సై మధుసూదన్ రెడ్డి, స్టేషన్ సిబ్బంది ఎస్సై శ్రీనివాసులును సన్మానించారు. ఘనంగా వీడ్కోలు పలికారు. ఎస్సై శ్రీనివాసులు ప్రొద్దుటూరులో రెండు సంవత్సరాల పాటు విధులు నిర్వర్తించారు. స్టేషన్ పరిధిలో ఫిర్యాదుల స్వీకరణ, విచారణ, పరిష్కారంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు.