రూ.15.70 కోట్లతో అమృతనగర్ అభివృద్ధి: మాజీ ఎమ్మెల్యే
ప్రొద్దుటూరు మండలం అమృతనగర్ కాలనీలో వైసీపీ ప్రభుత్వంలో రూ.15.70 కోట్లతో అభివృద్ధి చేశామని స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. సోమవారం అమృతనగర్లో టిడిపి నుంచి వైసీపీలోకి వచ్చిన వారిని రాచమల్లు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్లు, డ్రైన్లు, త్రాగునీటి పైపులైన్లు తమ హయంలోనే ఏర్పాటు చేశామన్నారు. దివంగత YSR ఏర్పాటు చేసిన అమృతనగర్ కాలనీని MLA వరదరాజుల రెడ్డి పట్టించుకోలేదన్నారు. అధికార పార్టీకి చెందిన వారు కబ్జాలు చేసి, స్థలాలు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.