100 మీటర్ల తిరంగాతో ర్యాలీ.!
ప్రొద్దుటూరు: పట్టణంలో శుక్రవారం
వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 100 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. స్థానిక శ్రీనివాస నగర హెల్త్ సెంటర్ నుంచి శివాలయం సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించడానికి ర్యాలీ చేపట్టినట్లు డిప్యూటీ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. గీత తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డా. నజీర్ బాషా, నాగార్జున, భరత్ నారాయణ, మురళీకృష్ణ రెడ్డి, మానస, సుప్రియ, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.