పరీక్షల ఫీజు గడువు పొడగింపు: డీఈఓ శంషుద్దీన్

కడప: ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం 2026-27 విద్యా సంవత్సరానికి సంబందించిన పదవ తరగతి మరియు ఇంటర్మీడియేట్ కోర్సులలో ప్రవేశాలకు అపరాధ రుసుము లేకుండా తేదీ 15-11-2026 వరకు గడువు పొడిగించడం జరిగింది.  అపరాధ రుసుము రూ.200/- తో తేదీ 16-11-2026 నుండి 30-11-2026 వరకు  ప్రవేశం పొందుటకు గడువును పొడిగించడం జరిగిందని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. షంషుద్దీన్,  ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ L. శ్రీకాంత్ సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. చదువు మధ్యలో మానేసి అర్హులైన వారు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ కోర్సులలో ప్రవేశాలు పొందగలరు. నిర్ణిత గడువు లోపు అభ్యాసకులు సమీపంలోని AP ONLINE ద్వారా మరియు APOSS అధికారిక website WWW.APOPENSCHOOL.AP.GOV.IN ద్వారా ప్రవేశం పొందగలరని తెలియజేశారు.