"కాంప్లెక్స్ సమావేశాలను మార్పు చేయాలి" : శ్యామ్

ప్రొద్దుటూరు, రాజుపాలెం మండలాలలోని ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఆంగ్ల, హిందీ ఉపాధ్యాయులకు నెలవారీగా జరిగే క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలను ప్రొద్దుటూరులో నిర్వహించాలని పొద్దుటూరు ఉప విద్యాశాఖ అధికారి శివప్రసాద్ కు ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఉపాధ్యాయులందరూ పొద్దుటూరు పట్టణంలో నివాసం ఉండడం వల్ల రాజుపాలెంలో సమావేశాన్ని నిర్వహించడం వల్ల తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.  రవాణా సౌకర్యాలు కూడా సరిగా లేనందున ఈనెల నుంచి జరిగే కాంప్లెక్స్ సమావేశాలను ప్రొద్దుటూరులోనే నిర్వహించాల్సిందిగా కోరారు.  సమస్య పరిష్కరిస్తామని తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో ఎపిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ నరసింహాకుమార్,  ప్రొద్దుటూరు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు సుబ్బారెడ్డి, సయ్యద్ బాషా, జిల్లా కౌన్సిలర్లు నర్సింహారెడ్డి, ఈశ్వర్ రెడ్డి, రిజ్వాన్ ఆలీ, ఇక్బాల్ బాషా పాల్గొన్నారు.