వైసిపి చైర్మన్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ.!
ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ స్థానానికి ఆరు నామినేషన్లను సరైనవిగా అధికారులు గుర్తించారు. వైసిపి అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి ఇర్ఫాన్ భాష నామినేషన్లను తిరస్కరించారు. నంద్యాల రాఘవరెడ్డి(టిడిపి), బచ్చల వీర ప్రతాప్(టిడిపి), పుత్తా లక్ష్మిరెడ్డి(ఇండిపెండెంట్), కందుల మునిరెడ్డి(ఇండిపెండెంట్), నవీన్ కుమార్ రెడ్డి(ఇండిపెండెంట్), జగన్ మోహన్ రెడ్డి(ఇండిపెండెంట్) నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.