ప్రొద్దుటూరు కమిషనర్ పై హైకోర్టులో పిటిషన్.!

ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ పై ఎగ్జిబిషన్ కాంట్రాక్టర్ కాకర్ల షణ్ముఖరెడ్డి బుధవారం రాష్ట్ర హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.  ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె పంచాయితీలో ఎగ్జిబిషన్ ఏర్పాటుకు సంబంధిత అధికారులు అనుమతులు ఇచ్చారని, వాటిని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ పిర్యాదుతో రద్దు(హోల్డ్) చేశారని షణ్ముఖరెడ్డి కోర్టులో పిటిషన్ చేశారు.  
ఈనెల 9న ప్రారంభం కావాల్సిన ఎగ్జిబిషన్ మున్సిపల్ కమిషనర్ పిర్యాదుతో ఆగిపోయిందని, మున్సిపల్ కమిషనర్ నుంచి నష్ట పరిహారం ఇప్పించాలని, ఎగ్జిబిషన్ అనుమతులు పునరుద్ధరించాలని కోర్టును ఆశ్రయించారు.  హైకోర్టులో  జస్టిస్ కిరణ్మయి వద్దకు విచారకు ఈ పిటిషన్ వెళ్లింది.  తూతిక శ్రీనివాస విశ్వనాధ్ పై వ్యక్తిగతంగా, కమీషనర్ హోదాలో పార్టీగా చేర్చారు.
పంచాయతీ ఎగ్జిబిషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.!
ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీలో టిడిపి నేత ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి వర్గీయుడు షణ్ముఖ రెడ్డి  ఎగ్జిబిషన్ ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ లభించింది.  రేపు గురువారం సాయంత్రం ప్రారంభోత్సవం చేస్తున్నారు.  ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ అవగాహన లేమితో అధికారులందరికీ ఫిర్యాదులు చేసి పంచాయితీ ఎగ్జిబిషన్ అనుమతులు నిలుపుదల చేయించారు.  కమీషనర్ తీరుతో ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు ఇబ్బందులు పడ్డారు.  తలలు పట్టుకున్నారు.  చివరికి హైకోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకున్నారు.  
*ఈ దసరా సందర్భంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో స్థానిక ఎమ్మెల్యే వర్గీయులు, కొత్తపల్లె పంచాయితీలో టిడిపి నేత ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి వర్గీయుడు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు.  2 ఎగ్జిబిషన్ లు ఏర్పాటవుతున్నాయి.  
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ఏకగ్రీవం.!