జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!
ప్రొద్దుటూరు: జల జీవన్ మిషన్ పనులకు సోమవారం పొద్దుటూరులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ శంకుస్థాపన చేశారు. పైలాన్ ఆవిష్కరించారు. స్థానిక MLA వరదరాజుల రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు.
*ప్రొద్దుటూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కొర్రపాడు రోడ్డు 100 అడుగుల విస్తరణ పనులకు సీఎం చంద్రబాబు నిధులు ప్రకటించారు. ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నికల్, ఇంజనీరింగ్ కళాశాలలను స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలుగా మారుస్తామన్నారు. కొత్త మున్సిపల్ కూరగాయల మార్కెట్ పనులకు నిధులు పరిశీలిస్తామన్నారు. ప్రొద్దుటూరు మండలం తాళ్ళమాపురం గ్రామానికి డిప్యూటీ సీఎం పవన్ నిధులు మంజూరు ప్రకటించారు. అంతకు ముందు స్థానిక MLA వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ఆగిపోయిన మున్సిపల్ మార్కెట్, రోడ్ల విస్తరణ, కాలేజి భవనాలకు, డ్రైనేజీ అభివృద్ధికి, పెన్నానగర్ అటవీ భూముల్లో నివాసాలున్న వారికి శాశ్వత పరిష్కారం చేయాలని CM చంద్రబాబును కోరారు. వినతి పత్రం ఇచ్చారు.