ప్రొద్దుటూరు చైర్మన్, ఎంపీపీ, జడ్పీటీసీ వీరేనా.?
ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ, జడ్పీటీసీ పదవులు ఏకగ్రీవం అవుతున్నట్లు సమాచారం. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ గా స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సోదరుడు నంద్యాల రాఘవరెడ్డి, ప్రొద్దుటూరు ఎంపీపీగా చౌటపల్లె లక్ష్మిరెడ్డి కోడలు భారతి, ప్రొద్దుటూరు జడ్పీటీసీగా మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య కుమారుడు బచ్చల వీర ప్రతాప్ నామినేషన్లు దాఖలు చేశారు. వీరి నామినేషన్లు ఆమోదం పొందాయి. వీరికి పోటీగా వేసిన వైసిపి అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వీరి ఏకగ్రీవ ఎన్నికకు అడ్డంకులు తొలగిపోయాయని భావిస్తున్నారు.
*ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్, 52 వార్డులకు నామినేషన్ల ఉపసంహరణ పూర్తయింది. సింగల్ అభ్యర్థులు మాత్రమే మిగిలారు. రేపు ఆదివారం అధికారికంగా వీరి జాబితాను అధికారులు ప్రకటించనున్నారు. డిక్లరేషన్ ఫారాలు ఇవ్వనున్నారు.
*ప్రొద్దుటూరు మండలంలో 24 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటికి 65 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. శనివారం నామినేషన్ల పరిశీలన పూర్తయింది. టిడిపి-35, జనసేన-3 నామినేషన్లను ఆమోదించారు. వైసిపి, సీపీఎం, ఇతరులకు చెందిన 27 నామినేషన్లను తిరస్కరించారు. ఇక్కడ కూడా అన్ని ఎంపీటీసీలకు ఏకగ్రీవంగా చేసుకోవడానికి చర్చలు, ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రొద్దుటూరు వైసిపి జడ్పీటీసీ అభ్యర్థి ఓబయ్య నామినేషన్ తిరస్కరణతో ఇక్కడ కూడా టిడిపి ZPTC అభ్యర్థి బచ్చల వీర ప్రతాప్ ఏకగ్రీవం ఖాయమంటున్నారు.
*రాజుపాలెం మండలంలో 9 MPTC స్థానాలు ఉన్నాయి. 34 నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం నామినేషన్ల పరిశీలనలో 4 నామినేషన్లను తిరస్కరించారు. 30 నామినేషన్లను సరియైనవిగా ఆమోదించారు.