కమిషనర్ కు రూ.25 లక్షలు ముట్టింది: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు
ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ కు రూ.25 లక్షలు ముట్టిందని స్థానిక వైసిపి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడ ఓటు ఉందని చెప్పడానికి, నిలపడానికి, నివేదికలను పైకి పంపడానికి, అధికారులందరినీ లొంగి ఉంచడానికి పెద్ద సారుకు కూడా పెద్ద మొత్తంలోనే ముట్టిందని అందరూ అంటున్నారని రాచమల్లు తెలిపారు.
అధికార టిడిపి అభ్యర్థులను ఏకగ్రీవం చేయించినందుకు, వైసిపి అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నందుకు, స్క్రూటినీలో వైసిపి నామినేషన్లు తిరస్కరించినందుకు కానిస్టేబుల్ మొదలుకొని ఆఫీసర్ వరకు, కెమెరామెన్ నుంచి మున్సిపల్ కమిషనర్ వరకు ప్రతి ఒక్కరికి వెలకట్టి టిడిపి నేతలు డబ్బులిచ్చారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆరోపించారు. ఎవ్వరెవ్వరికి ఎంతెంత ఇచ్చారనే వివరాలను ఆయన మాటల్లోనే వినండి.
*మేము డబ్బులు తీసుకోలేదు