ప్రొద్దుటూరులో మీడియాపైనా దాడి: రాచమల్లు
ప్రొద్దుటూరులో టిడిపి గూండాలు మీడియాపై ఆంక్షలు విధించారని, ఆమడదూరం తరిమారని స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..
మున్సిపల్ కార్యాలయంలో టీడీపీకి చెందిన గుండాలు, రౌడీలు తిష్టవేసి, వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారని, పత్రాలను లాక్కున్నారని, దాడులు చేశారని, కొట్టారని తెలిపారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని విమర్శించారు. మహిళల పట్ల అవమానకరంగా అసహ్యంగా ప్రవర్తించారన్నారు. ప్రొద్దుటూరులో ఎప్పుడూ చూడని పరిస్థితిని ఇక్కడి ప్రజలకు టిడిపి నేతలు చూపించారన్నారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.