టిడిపి చైర్మన్ అభ్యర్థి రాఘవరెడ్డి నామినేషన్.!
ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ స్థానానికి టిడిపి అభ్యర్థిగా స్థానిక ఎమ్మెల్యే సోదరుడు నంద్యాల రాఘవరెడ్డి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు స్థానిక అమ్మవారిశాల, దర్గాలో పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ MLC బచ్చల పుల్లయ్య, షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ముక్తియార్, టిడిపి నేతలు పాల్గొన్నారు.