మున్సిపల్ కమిషనరా.. మాపియానా.?: టిడిపి నేత ఉక్కు ప్రవీణ్
ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ మాపియాలా వ్యవహరిస్తున్నాడని ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి మాజీ ఇంచార్జ్ ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ గా వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష వైసీపీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకొని వారికి ఏజెంట్ గా పనిచేస్తున్నాడన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అక్కడెక్కడో బ్రేక్ డాన్స్ వేసినట్లు ప్రొద్దుటూరులో చేస్తే ఊరుకునేది లేదన్నారు. ముసిపల్ కమిషనర్ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందన్నారు. కమిషనర్ అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టాలన్నారు. పూర్తి అమౌంట్ వసూలు చేయకుండా మున్సిపల్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి ప్రొసీడింగ్స్ ఇచ్చారన్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. అక్కడిలా ఇక్కడ డాన్స్ కుదరదన్నారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.