YSR ఆరోగ్యశ్రీ ఇప్పుడెక్కడ.?: రాచమల్లు
ప్రొద్దుటూరు: దివంగత మాజీ సీఎం YSR పేదలకు కార్పోరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించడానికి ఆరోగ్యశ్రీ పథకం తీసుకు వచ్చాడని, ఆ పథకం ఇప్పుడెక్కడని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రశ్నించారు.
మాజీ సీఎం వైస్సార్ వర్ధంతి పురస్కరించుకొని బుధవారం స్థానిక మైదుకూరు రోడ్డులోని వైస్సార్ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఫ్రూట్స్, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైస్సార్ పేదలకు కార్పోరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు.