అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

ప్రొద్దుటూరు అమ్మవారిశాలలో బంగారు వ్యాపారులు, గుమస్తాలు, బంగారు నగల తయారీ కార్మికులతో శనివారం స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సమావేశమయ్యారు.  వ్యాపారాలు, సమస్యలు, పనుల గురించి వారితో చర్చించారు.  
ఆన్లైన్, కార్పోరేట్ కంపెనీల రాకతో వ్యాపారాలు పడిపోయాయని జ్యూవెలరీ అసోసియేషన్ అధ్యక్షుడు కొప్పర్తి మధుసూదన్ తెలిపారు.  AI కంప్యూటర్ మోడల్ తయారీతో పనులు తగ్గిపోయాయని గోల్డ్ స్మిత్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ ఇలియాస్ వాపోయారు.  స్థానిక వ్యాపారులకు తాను అండగా ఉంటానని అమ్మవారి సాక్షిగా MLA వరదరాజుల రెడ్డి వారికి హామీ ఇచ్చారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?