ఇలా ఉంటే.. ఎలా ఉంటారు:MLA వరదరాజుల రెడ్డి
ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ యార్డును శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పరిశీలించారు. శిథిలావస్థలోని కార్యాలయ భవనాలను తనిఖీ చేశారు. పైకప్పు, గోడలు, పిల్లర్లు పెచ్చులూడి కడ్డీలు బయటికి వచ్చాయని చైర్మన్ లక్ష్మణ్, సెక్రటరీ రత్నరాజు ఎమ్మెల్యేకి చూపించారు. రిపేర్లకు కూడా వీలులేదని, కొత్త భవనాలను నిర్మించాల్సి ఉందని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. యార్డులోపల డ్రైనేజీని ఇటీవల మున్సిపల్ కమిషనర్ పరిశీలించి వెళ్ళారని, పనులు చేయలేదని ఎమ్మెల్యేకి తెలిపారు. ఉన్నతాధికారులతో మాట్లాడి అభివృద్ధి చేయిస్తామని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.