ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలం:CPI
ప్రొద్దుటూరు: నిత్యావసరాల ధరల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రామయ్య విమర్శించారు. ఈమేరకు ఆయన బుధవారం పొద్దుటూరు మండల రెవెన్యూ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ధరలు పెరిగాయన్నారు. ముఖ్యంగా పేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అక్రమ నిల్వలను బహిరంగ మార్కెట్లో పంపిణీ చేయాలన్నారు.