CMRF చెక్కులు పంపిణీ చేసిన MLA వరదరాజుల రెడ్డి.!

ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం CMRF చెక్కులను లబ్ధిదారులకు MLA వరదరాజుల రెడ్డి పంపిణీ చేశారు.  31వ విడత 46 మందికి రూ.35,24,537లు పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకుంటున్న సీఎం చంద్రబాబుకు ప్రజలందరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.  కూటమి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు.  కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి ఇప్పటి వరకు CM Relief Fund పంపిణీ కార్యక్రమంలో రాష్ట్రంలో ప్రొద్దుటూరు నియోజకవర్గం 2, 3 స్థానాలలో ఉంది.  ఇప్పటి వరకు 1401 మందికి సుమారు 12,22,95,126.00 (పన్నెండు కోట్ల ఇరవై రెండు లక్షల తొంబై అయిదు వేల రూపాయలు) పంపిణీ చేయడం జరిగిందన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?