విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలి: CGM రమణ

ప్రొద్దుటూరులో మంగళవారం డివిజన్ అధికారులతో APSPDCL తిరుపతి చీఫ్ జనరల్ మేనేజర్ రమణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఉష్ణోగ్రతలు వేసవి కన్న పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్‌ను అవసరమైనంత మేరకు మాత్రమే వినియోగించి, అనవసర ఖర్చులను తగ్గిస్తూ ఆదా చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రజల విద్యుత్ సమస్యల పరిష్కారానికి డిస్కం CMD గారు డైల్ యువర్ CMD, కరెంటోళ్ల జనబాట, వంటి వినూత్న కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహిస్తూ, వచ్చిన సమస్యలను అత్యధిక ప్రాధాన్యతతో పరిష్కరిస్తున్నారని తెలిపారు.
రైతుల విద్యుత్ సమస్యల కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసిన విషయాన్ని వెల్లడిస్తూ, ఈ సమాచారాన్ని రైతుల వద్దకు తీసుకువెళ్లాలని అధికారులకు ఆదేశించారు.
విద్యుత్ సామగ్రి కొరత లేదని, అందువల్ల కొత్త సర్వీసుల విడుదలలో ఎటువంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు విద్యుత్ సేవలపై పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.
ప్రజల సౌకర్యార్థం విద్యుత్ బిల్లులు సులభంగా చెల్లించేందుకు PhonePe వంటి డిజిటల్ చెల్లింపు వేదికలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు.
ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ చాంద్ భాష, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, అకౌంట్స్ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?