టౌన్ బ్యాంక్ CEOను కార్యాలయానికి పిలిపించి ఆరా తీసిన DLCO.!
ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకుపై వచ్చిన ఆరోపణలపై బ్యాంకు CEO నిరంజన్ రెడ్డి బుధవారం సాయంత్రం సహకార శాఖ డీఆర్ కార్యాలయానికి వెళ్ళి వివరణ ఇచ్చుకున్నారు. విద్యుత్ ఉద్యోగి బొంతలకుంట సుబ్బరాయుడు ఇన్స్యూరెన్స్ అమౌంట్, పోర్జరీ సంతకాలు, బినామీ అకౌంట్లపై DLCO సత్యానందకు బ్యాంకు CEO నిరంజన్ రెడ్డి వివరణ ఇచ్చారు. విచారణ అధికారి అసిస్టెంట్ రిజిస్ట్రార్ కృష్ణారెడ్డికి సహకరించాలని, సంబంధిత రికార్డులు అందుబాటులో ఉంచాలని DLCO సత్యానంద్ CEOను ఆదేశించారు.