రామేశ్వరం యేటిలో మృతదేహం.!
ప్రొద్దుటూరు: స్థానిక రామేశ్వరం గంగమ్మ దేవళం వెనుక వైపు యేటిలో గుర్తు తెలియని మృతదేహం బుధవారం బయటపడింది. స్థానికులు VRO ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ సీఐ నాగభూషణ్, ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని వివరాలు కోసం విచారిస్తున్నారు. 30-35 సంవత్సరాల వయస్సు ఉంటుందని, 2-3 రోజుల క్రితం మృతి చెందినట్లు తెలిపారు.