వాహనాల గాలి తీయించిన మున్సిపల్ కమిషనర్.!
ప్రొద్దుటూరు: ట్రాఫిక్ సమస్య కలిగిస్తూ రోడ్లపై పార్క్ చేసిన వాహనాలపై స్థానిక మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ చర్యలు చేపట్టారు. మున్సిపల్ సిబ్బందితో వాహనాల చక్రాల్లో గాలి తీయించారు. ఆయన బుధవారం పట్టణంలో పర్యటించి ట్రాఫిక్ సమస్యలను పరిశీలించారు.
*పట్టణంలోని వార్డు సచివాలయాలను బుధవారం మున్సిపల్ కమిషనర్ సందర్శించారు. సచివాలయాల్లో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన లబ్ధిదారులతో మాట్లాడారు. అక్కడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.