ప్రొద్దుటూరులో మట్కా బీటర్లు అరెస్ట్.!
ప్రొద్దుటూరు: పెన్నానగర్ చెందిన షేక్ ఖాదీర్, దూదేకుల దస్తగిరి, దేవరగుంట్ల దస్తగిరి, కాకర్ల దస్తగిరి LIC ఆఫీస్ సమీపంలో మట్కా రాస్తుండగా 1టౌన్ ఎస్సై మధుసూదన్ రెడ్డి మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మట్కా చీటీలు, రూ.9వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. బీటర్లతో పాటు మట్కా అడేవారిపైనా కేసులు నమోదు చేస్తామని ఎస్సై హెచ్చరించారు.