బినామీ అకౌంట్లు, ఫోర్జరీ సంతకాలపై.. విచారణ.!
ప్రొద్దుటూరుకు చెందిన విద్యుత్ శాఖ ఉద్యోగి ఇటీవల మృతి చెందాడు. ఆయన ఇద్దరు కుమార్తెల్లో అక్కకు ఇన్స్యూరెన్స్ అమౌంట్, చెల్లెలికి ఉద్యోగము తీసుకునేలా సర్దుబాటు చేసుకున్నారు. ఆయన పేరుతో సుమారు రూ.కోటి ఇన్స్యూరెన్స్ కోర్టు ద్వారా వచ్చింది. అందులో కొంత మొత్తాన్ని ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్ అకౌంట్లో జమ చేశారు.
బ్యాంకులో అక్క పేరుతో చెల్లెలు బినామి అకౌంట్ ఓపెన్ చేసి, ఫోర్జరీ సంతకాలతో ఇన్స్యూరెన్స్ అమౌంట్ డ్రా చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం స్థానిక టిడిపి, వైసిపి ముఖ్య నేతల వద్దకు వెళ్ళింది. ఇద్దరూ లోలోపల ఒక్కటై సర్దుబాటు చేసుకున్నారని, ఇది నచ్చని బ్యాంక్ పాలకవర్గములోని ముఖ్యుడొకరు పత్రాలతో సహా వివరాలు బయటికి పంపారు. కోర్టు, సహకార, ఆర్బిఐ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై సహకార శాఖ అధికారులు విచారణ చేపట్టారు. DCO వెంకటసుబ్బయ్య ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు DLCO సత్యానంద్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కృష్ణారెడ్డిని విచారణకు నియమించారు. ఇన్స్యూరెన్స్ అమౌంట్ కోసమే బినామీ అకౌంట్స్ ఈ బ్యాంకులో ఓపెన్ చేయిస్తుంటారని ఆరోపణలు వస్తున్నాయి.