చెకుముకి సైన్స్ పోటీలు.. విజేతలకు బహుమతులు ప్రధానం.!

ప్రొద్దుటూరు: సైన్స్ తోనే జీవన మనుగడ సాధ్యమని, చెకుముకి సైన్స్ సంబరాలు విజయవంతంగా నడిచాయని  ఉప విద్యాధికారి శివ ప్రసాద్,  మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్  తెలిపారు. జనవిజ్ఞాన వేదిక మండలస్థాయి సంబరాలు తోగట క్షత్రియ కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదిమ సమాజం నుంచి రాకెట్ యుగంలోకి మనం ప్రయాణించడానికి సైన్సే కారణమని, నిత్యజీవితంలో మూఢనమ్మకాలను వదిలి రుజువుల ఆధారిత సైన్స్ ను నమ్మాలని తెలిపారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్  మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చెకుముకి సంబరాలలో నాలుగు లక్షలమంది, ప్రొద్దుటూరులో 8500 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తొగటవీర క్షత్రియ సంఘం జిల్లా అధ్యక్షులు సూర్యనారాయణ,  కళ్యాణ మండపం వ్యవస్థాపక అధ్యక్షుడు రఘురామయ్య,  మురుకూటి సూర్యనారాయణ రెడ్డి, ఇన్నర్ వీల్ సాయిప్రీతి, రాష్ట్ర కమిటీ సభ్యులు సునీత, చెకుముకి కన్వీనర్ రవిబాబు, ఉషారాణి, మురళీ గుప్త, జిటి ఈశ్వరయ్య, ప్రకాష్, నరేష్, సుందరమ్మ, దేవానంద్, శిరీష, భాస్కర్ రెడ్డి, దేవమణి, మీనా, మధు, రాజశేఖరరెడ్డి, మహిత, దీప్తి కాలేజి విద్యార్థులు వాలెంటర్లు గా సహకరించారు. 
*8,9,10 తరగతి ప్రభుత్వ పాఠశాల విభాగంలో
 SPCN మున్విసిపల్ పాఠశాల ప్రణీత్ నరసింహ, నరసింహ తరుణ్, యామినిలు రాగా, 
రెండవ బహుమతి: మున్సిపల్ హైస్కూల్ నడింపల్లి నుంచి శివ కైలాస్, సురేష్, ఆశిఫ్
మూడవ బహుమతి: జిల్లా పరిషత్ హైస్కూల్ కల్లూరు నుంచి నిఖిల్, తేజేశ్వర్, రిమ 
*ప్రైవేట్ విభాగం నుంచి
మొదటి బహుమతి: గౌతమ్ హైస్కూల్ నుంచి హర్షిణి శ్రీ, నేహ, సతిష్ రెడ్డి
రెండవ బహుమతి: గౌతమ్ హైస్కూల్ నుంచి ఫాతిమ హిబతుల్లాహ్, ప్రశాంతి, విరాజిత్ కుమార్ రాజు
మూడవ బహుమతి: శ్రీ సరోజిని హైస్కూల్ నుంచి మహబూబ్ ఆరీఫ్, మహమ్మద్ సాదిక్, రాజేష్ లు విజేతలు గా నిలిచారు. 
*జూనియర్ చెకుముకి 6,7 తరగతుల విభాగంలో
ప్రభుత్వ పాఠశాలల నుంచి
మొదటి బహుమతి: జిల్లా పరిషత్ చెన్నంరాజు పల్లె నుంచి అఖిల, అజయ్, రెండవ బహుమతి SPCN మున్సిపల్ హైస్కూల్ రామేశ్వరం నుంచి అభిరామ్ నిఖిల్, త్రిషిత, 
మూడవ బహుమతి జిల్లాపరిషత్ చౌడూరు నుంచి ఇమ్రాన్, సుహాన,
*ప్రైవేటు విభాగం నుంచి మొదటి బహుమతి: గౌతమ్ హైస్కూల్ నుంచి సుజన్ కృష్ణ, తనుశ్రీ, 
రెండవ బహుమతి: గోపీకృష్ణ నుంచి కనిస్క్ రెడ్డి, చేతన శ్రీ
మూడవ బహుమతి: సెయింట్ జోషఫ్ నుంచి అఫ్సీన్, సుమ రాణి లు విజేతలుగా నిలిచారు.
*సబ్ జూనియర్ చెకుముకి 5వ తరగతి విభాగం నుంచి
ప్రభుత్వ పాఠశాలల విభాగంలో
మొదటి బహుమతి: జిల్లాపరిషత్ చెన్నంరాజుపల్లె నుంచి రిషిత, రెండవ బహుమతి: మున్సిపల్ మాడల్ ప్రైమరీ వసంతపేట మొహిత్, మూడవ బహుమతి మున్సిపల్ ప్రైమరీ చౌడేశ్వరి నగర్ అనూష.
*ప్రైవేట్ స్కూల్స్ నుంచి మొదటి బహుమతి గోపీకృష్ణ వినమ్ర, రెండవ బహుమతి గౌతమ్ హైస్కూల్ నుంచి నదీమ్,
మూడవ బహుమతి: గౌతమ్ హైస్కూల్ నుంచి జుల్కల్ నైన్ విజేతలుగా నిలిచారు. వీరికి మొమెంటో, సర్టిఫికెట్లు ఇచ్చారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు కమిషనర్ పై హైకోర్టులో పిటిషన్.!

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ఏకగ్రీవం.!