పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లపై చర్యలు: మున్సిపల్ కమిషనర్

ప్రొద్దుటూరు: పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ ఆదేశించారు.  15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై కమిషనర్ గురువారం ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు.  49 పనులకు గాను 14 పనులు మాత్రమే ప్రారంభం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  మిగిలిన పనులను త్వరితగతిన ప్రారంభించాలని,  అగ్రిమెంట్ పూర్తయిన పనులను వెంటనే గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు.  పనులు ప్రారంభించడంలో నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలన్నారు.  విధుల నిర్వహణలో అలసత్వంపై ఇంచార్జి ఏఈ ఉదయ్ కుమార్ రెడ్డిపై కమీషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరిగి సచివాలయం విధులకు పంపిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ME శ్రీనివాసులు, DEలు రాజేష్, యశోద, AEలు సురేంద్ర, దస్తగిరి, వినోద్, సందీప్ పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?