నేత్ర దానంపై అవగాహన.!
ప్రొద్దుటూరు: స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం నేత్ర దానంపై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారి మాధవీలత మాట్లాడుతూ.. 25 ఆగస్ట్ - 8 సెప్టెంబర్ వరకు నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చనిపోయిన వ్యక్తి నేత్ర దానం ఇద్దరు అంధులకు చూపు అందిస్తుందన్నారు. అపోహలు వద్దన్నారు. ముందుకు రావాలన్నారు.
డిప్యూటీ DMHO డా. గీత, సూపరింటెండెంట్ డా. ఆనందబాబు, డా. రూపానంద్, రఘురామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.