ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ బీసీలకే ఇవ్వాలి: బంగారెడ్డి
ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ పదవికి బీసీలనే పోటీ చేయించాలని టీడీపీ నేతలను స్థానిక మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రొద్దుటూరులో 80 వేలకు పైగా బీసీ ఓటర్లు ఉన్నారన్నారు. వారికే చైర్మన్ పదవి ఇవ్వాలన్నారు. కాగా.. స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి చైర్మన్ ఓసీకి కేటాయించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. బీసీలంతా చైర్మన్ పదవి కోసం ఎమ్మెల్యేపై ఒత్తిడి చేయాలన్నారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.