ప్రొద్దుటూరులో క్రికెట్ బుకీలు అరెస్ట్: 1టౌన్ సీఐ కొండారెడ్డి
ప్రొద్దుటూరులో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు బుకీలను బుధవారం అరెస్ట్ చేసినట్లు సీఐ కొండారెడ్డి తెలిపారు. ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న హుస్సేన్, సురేష్ లను ఎస్సై మొయినుద్దీన్ అరెస్ట్ చేశారని తెలిపారు.
వారి వద్ద నుండి రూ.20,000 నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఆన్‌లైన్ బెట్టింగ్, మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు ఇటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, బెట్టింగ్‌కు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సీఐ కొండారెడ్డి సూచించారు.