ప్రజల భాగస్వామ్యం అభినందనీయం: ఎస్పీ నచికేత్ విశ్వనాథ్

ప్రొద్దుటూరు: ఏఎస్పీ విభుకృష్ణ చొరవ, దాతల సహకారంతో. స్థానిక సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయం ఆధునీకరణ చేపట్టినట్లు జిల్లా ఎస్పీ విశ్వనాథ్ తెలిపారు.  ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. 
పోలీస్ శాఖ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రజలు, ప్రముఖులు, దాతలు, శ్రేయోభిలాషులు అందిస్తున్న సహకారం ఎంతో అభినందనీయమన్నారు. సమాజంలోని వివిధ వర్గాల సహకారంతో పోలీసులకు మెరుగైన పని పరిస్థితులు కల్పించడంతో పాటు, ప్రజలకు మరింత సమర్థవంతమైన, నాణ్యమైన పోలీస్ సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
ప్రధాన దాత డాక్టర్ వై.వి. స్వరూప్ కుమార్ రెడ్డి అందించిన సహకారాన్ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందిస్తూ, కార్యాలయ పునరుద్ధరణకు సహకరించిన ఇతర దాతలు, శ్రేయోభిలాషులందరికీ పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు కమిషనర్ పై హైకోర్టులో పిటిషన్.!

జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం, డిప్యూటీ సీఎం.!

ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ఏకగ్రీవం.!