టౌన్ బ్యాంక్ వివాదంలో నాకు సంబంధం లేదు: ఇవి సుధాకర్ రెడ్డి

ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్ వివాదంలో తన పాత్ర లేదని టీడీపీ నేత ఇవి సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు.  ఆయన శనివారం టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.  టౌన్ బ్యాంకులో ఇన్స్యూరెన్స్ అమౌంట్ స్వయంగా ఖాతాదారులే డ్రా చేసుకున్నారన్నారు.  ఇందులో తాను తప్పు చేయలేదన్నారు.  మాజీ ఎమ్మెల్యే రాచమల్లు తనపై ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.  తాను తప్పుచేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్ చేశారు.  తాను రాజకీయాల్లో ఉన్నానని, అందరితోనూ పరిచయాలు, సంబంధాలు ఉన్నాయన్నారు.  టౌన్ బ్యాంకుపై వచ్చిన ఆరోపణలపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలన్నారు.  తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.  మీడియా సమావేశంలో వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?