ఎల్‌నినో పరిస్థితుల్లో పశువుల సంరక్షణపై పారా వెట్స్‌కు శిక్షణ.!
ప్రొద్దుటూరు: ఎల్‌నినో పరిస్థితుల్లో పశువుల ఆరోగ్యం, పశుగ్రాసం, నీటి నిర్వహణ, వేడి ఒత్తిడి నివారణపై పారా వెట్స్‌కు అవగాహన కల్పించేందుకు పశువైద్య కళాశాల, ప్రొద్దుటూరు ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు పశువైద్యశాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. జి.ఆర్.కె. శర్మ, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డా. వీరబ్రహ్మయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ డా. ధనుంజయ రెడ్డి పాల్గొన్నారు.
ప్రిన్సిపాల్ డా. జి.ఆర్.కె. శర్మ మాట్లాడుతూ, ఎల్‌నినో పరిస్థితుల్లో పశువుల ఆరోగ్యం, నీరు, పశుగ్రాసం, వేడి ఒత్తిడి నివారణపై ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. డా. ఇందిర ఎల్‌నినో పరిస్థితుల్లో పశువుల యాజమాన్య పద్ధతులు, పశుగ్రాస నిర్వహణ, నీటి పొదుపు, వేడి ఒత్తిడి నివారణపై వివరించారు. డా. రాజకిశోర్, డా. చరిత, డా. జాన్, డా. గాయత్రి, డా. వంశీ తదితరులు పశువుల ఆరోగ్యం, వ్యాధుల నివారణ, పశుపోషణ, శాస్త్రీయ యాజమాన్య పద్ధతులపై శిక్షణ ఇచ్చారు.
ఎల్‌నినో ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పశువులకు స్వచ్ఛమైన నీరు, తగినంత నీడ, గాలి ప్రసరణ, సమతుల్య పోషణ కల్పించాలని, పశుగ్రాసాన్ని ముందుగానే నిల్వ చేసుకోవాలని పారా వెట్స్‌కు సూచించారు. వేడి ఒత్తిడి లక్షణాలను గుర్తించి, వెంటనే పశువైద్య సేవలు అందించేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.