ఆ సోఫాలు కమీషనర్ తెచ్చాడా.?: ఇర్ఫాన్ బాషా
ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ చాంబర్లోని సోఫాల్లో ప్రజలు కూర్చుంటే, అక్కడ విఐపిలు మాత్రమే కూర్చోవాలి అంటూ అవమాన పరుస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఇర్ఫాన్ భాష తెలిపారు. ఆ సోఫాలను కమిషనర్ సొంత నిధులతో గాని, వీఐపీల సొంత నిధులతో గాని కొన్నవి కాదన్నారు. వాటిని మీ స్వంత నిధులతో కొని ఉంటే ఛాంబర్ నుండి తొలగించాలన్నారు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ ఓవరాక్షన్ పక్కనపెట్టి, తన ఉద్యోగం మాత్రం చేయాలని సూచించారు.
కమిషనర్ గా వచ్చిన కొత్తలో హడావిడి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్లు ఆఫీసులో ఉండేవారన్నారు. ప్రస్తుతం ఉద్యోగస్తులకు, ప్రజలకు, కాంట్రాక్టర్లకు, విలేకరులకు ఎవరికి అందుబాటులో ఉండడం లేదన్నారు. వినాయక చవితి నిమజ్జనం సాకుతో ఆఫీసుకు రావడం లేదన్నారు. అధికారుల ద్వారా ఆ కార్యక్రమం జరిపించాల్సింది పోయి, ఎవరికి అందుబాటులో లేకుండా పోయాడున్నారు. విద్యార్థులకు పర్యావరణం గురించి పాఠాలు చెప్పడానికి క్వాలిఫైడ్ టీచర్లు ఉండగా కమిషనర్ పాఠాలు చెప్పవలసిన అవసరం ఏముందన్నారు.