గని గుంతల్లో నిమజ్జనాలా.?
ప్రొద్దుటూరులోని గణేష్ విగ్రహాల నిమజ్జనం బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. గతంలో కామనూరు, అన్నవరం కుందూ బ్రిడ్జిల వద్ద నిమజ్జనం నిర్వహించారు. ఈసారి కూడా అక్కడే చేయాలని పోలీస్, ఫైర్, ఎలక్ట్రిసిటీ, R&B అధికారులు భావించారు. అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. కాగా.. మున్సిపల్ కమిషనర్ మాత్రం జమ్మలమడుగు రోడ్డులోని పెద్దశెట్టిపల్లె గనిగుంతల్లో నిమజ్జనం చేయాలని ప్రతిపాదించారు. దీనిపై అక్కడి చేపల పెంపకం దారులు, స్థానికులు, విద్యాసంస్థల యాజమాన్యం, ఇతర శాఖల అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ కస్టమంటున్నారు. PDTR-JMD ట్రాఫిక్ ఎక్కడికి మళ్లించాలంటున్నారు. గనిగుంతల్లో నిమజ్జనంపై భక్తులు వ్యతిరేకత తెలుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో నిమజ్జనం ఏర్పాట్లపై సందిగ్ధత నెలకొంది.