ఎల్ నినో పరిస్థితులపై రైతులకు అవగాహన.!
ప్రొద్దుటూరు: స్థానిక గోపవరంలో గురువారం వెటర్నరీ కాలేజీ ఆధ్వర్యంలో ఎల్‌నినో పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించారు. పశువుల ఆరోగ్యం, పశుగ్రాసం, నీటి నిర్వహణ, వేడి ఒత్తిడి నివారణపై రైతులకు శిక్షణ ఇచ్చారు.
పశువుల ఆరోగ్యం, వ్యాధుల నివారణ, పశుపోషణ మరియు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు.
రైతులు పశువులకు స్వచ్ఛమైన నీరు, తగినంత నీడ, గాలి ప్రసరణ, సమతుల్య పోషణ అందించడంతో పాటు ఎండుగడ్డి, సైలేజ్ తదితర పశుగ్రాసాలను ముందుగానే నిల్వ చేసుకోవాలని సూచించారు. వేడి ఒత్తిడి లక్షణాలను గుర్తించి, అవసరమైనప్పుడు వెంటనే పశువైద్యులను సంప్రదించాలని సూచించారు. డా. ఇందిర, డా. చరిత, డా. గాయత్రి, డా. మంజుల, డా. జాన్, డా. వంశీ, డా. మాధవరెడ్డి తదితరులు రైతులకు అవగాహన కల్పించారు.