శివాలయం స్కాంలో బాలాజీని తప్పించి.. గుమస్థాపై వేటు.!

ప్రొద్దుటూరు అగస్త్యేశ్వరాలయం (శివాలయం) స్కాంలో ఆరోపణలున్న అధికారిని ఒదిలేసి గుమస్తా ప్రసాద్ ను గురువారం ఈఓ రమణ సస్పెండ్ చేశారు.
ఆలయ ఈఓగా శంకర బాలాజీ హయంలో రూ.కోటి నగదు, అమ్మవారి బంగారు హారం, స్వామి వారి వెండి కవచం మాయమయ్యాయని ఆలయ చైర్మన్ పిర్యాదు చేశారు.  వీటిపై మొదట ఎండోమెంట్ జ్యువెలరీ వెరిఫికేషన్ అధికారి పాండురంగారెడ్డి విచారణ జరిపి ఆభరణాలు మాయమయ్యాయని కర్నూల్ DCకి రిపోర్ట్ పంపారు.  
తర్వాత 6మంది ఆడిటర్లు తనిఖీలు నిర్వహించి, రూ.68 లక్షలు ఫ్రాడ్ జరిగిందని తిరుపతి RJCకి నివేదిక పంపారు.  దీనిపై గత నెలలో తిరుపతి RJC ప్రభుత్వానికి ఫైనల్ రిపోర్ట్ పంపారు. ఎండోమెంట్ కమిషనర్ చర్యలకు ఆదేశించారు. అధికారి శంకర బాలాజీని రక్షించడానికి గుమస్తా ప్రసాద్ పై వేటు వేశారని ప్రచారం జరుగుతోంది. 
ఆభరణాలు, నగదు రికవరీ లేదు.  తిన్న అధికారిపై చర్యలు లేవు.  దీంతో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పై దాతలకు, భక్తులకు నమ్మకం లేకుండా పోతోంది.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?