"జగనన్న కాలనీలను పట్టించుకోరా" కమిషనర్ ను కలిసిన బిజెపి నేతలు
పొద్దుటూరు బిజెపి నేతలు గురువారం స్థానిక మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ ను కలిశారు. జగనన్న ప్రభుత్వ ఇళ్ల కాలనీల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రొద్దుటూరు పట్టణ బిజెపి అధ్యక్షుడు నరేంద్ర ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు వినతి పత్రం సమర్పించారు. రామేశ్వరం, మీనాపురం, బొల్లవరం కాలనీల్లో కంపచెట్లు తొలగించాలని, రోడ్లు, డ్రైన్స్, స్ట్రీట్ లైట్స్, త్రాగునీరు ఏర్పాటు చేయాలన్నారు.