పర్యావరణంపై విద్యార్థులకు అవగాహన: కమిషనర్
ప్రొద్దుటూరు: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని స్థానిక మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ సూచించారు. ఆయన శుక్రవారం స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా మార్చడానికి ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.