నేనొచ్చేవరకు ఆ నీటిని తాగొద్దు: ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్
ప్రొద్దుటూరు: తానొచ్చేవరకు స్థానిక మోడంపల్లె ట్యాంక్ నీటిని ఆ ప్రాంత ప్రజలు తాగొద్దని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ బుధవారం ఉదయం ప్రజలకు సూచించారు. మోడంపల్లె ప్రాంతంలో సరఫరా అవుతున్న త్రాగునీరు ఫిల్టర్ కావడంలేదని తన దృష్టికి వచ్చిందన్నారు. ఆ నీటిని పూర్తిగా పరీక్షించాల్సి ఉందన్నారు. తాను స్వయంగా మోడంపల్లెకు వచ్చి పరిశీలిస్తానన్నారు. అప్పటివరకు ఆ ప్రాంత ప్రజలు ఆ నీటిని తాగొద్దని సూచించారు.