టౌన్ బ్యాంక్ ఉద్యోగాలను అమ్ముకున్న రాచమల్లు: ఇవి సుధాకర్ రెడ్డి
ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు తన హయాంలో టౌన్ బ్యాంకులో ఉద్యోగాలను అమ్ముకున్నాడని టీడీపీ నేత ఇవి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. గురువారం టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఇవి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ ఉద్యోగి సుబ్బరాయుడు 2016లో ప్రమాదంలో మరణించాడన్నారు. కుటుంబ సభ్యులు తనను కలవగా లాయర్ గా తాను ఆకేసు తీసుకున్నానన్నారు. ఆయన వారసులే ఇన్స్యూరెన్స్ అమౌంట్ తీసుకున్నారన్నారు. ఇందులో బినామీలు ఎవ్వరూ లేరన్నారు. టౌన్ బ్యాంకును అప్రతిష్టపాలు చేయాలని, మూయించాలని మాజీ ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నాడన్నారు. తాను బ్యాంకులో డిపాజిట్లు వేయించానని, అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. మీడియా సమావేశంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ సుబ్బారెడ్డి, మాజీ కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు.