లోక్ అదాలత్ కేసులపై జడ్జి సత్యకుమారి సమీక్ష.!

ప్రొద్దుటూరు మొదటి జిల్లా అదనపు జడ్జి & మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ సత్యకుమారి అధ్యక్షతన శనివారం స్థానిక కోర్టు కార్యాలయంలో లోక్ అదాలత్ కేసులపై సమావేశం నిర్వహించారు. ఈనెల 12న నిర్వహించనున్న లోక్ అదాలత్ కేసులపై సహచర జడ్జీలు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సభ్యులు, పోలీస్ అధికారులు, బ్యాంకులు, ఇన్స్యూరెన్స్ కంపెనీల మేనేజర్లు, లాయర్లతో చర్చించారు. భీమా చెల్లింపులు, ట్రాఫిక్ ఉల్లంఘనల పెండింగ్ చలనాలు
ఇరువర్గాల రాజీపై కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు.  జడ్జీలు వెంకటేశ్వర్లు, సురేంద్ర రెడ్డి,  ASP విభూకృష్ణ పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?