ఇళ్ల కోసం ఎమ్మెల్యేకి అర్జీలు పెట్టుకున్న పేదలు.!
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి సొంత ఇల్లు లేని పేదలు ఇళ్ల కోసం అర్జీలు పెట్టుకున్నారు. శనివారం ఆయన తన కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. 23 మంది ఇంటి స్థలాల కోసం దరఖాస్తులు ఇచ్చారు. మరో ముగ్గురు పక్కా ఇళ్లు మంజూరు చేయించాలని అర్జీలు పెట్టుకున్నారు. మొత్తం 40 మంది ప్రజలు సమస్యలపై ఎమ్మెల్యేకి అర్జీలు ఇచ్చారు. వాటిని ఆయన సంబంధిత అధికారులకు పంపించారు. అర్జీదారులకు సాధ్యమైనంత త్వరగా న్యాయం చేయాలని ఆదేశించారు.