ప్రొద్దుటూరులో కాంగ్రెస్ నేత నజీర్ పై దాడి.!
ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ MLA అభ్యర్థిగా పోటీ చేసిన నజీర్ పై ఆదివారం దాడి జరిగింది. నజీర్, ఆయన కుమారుడు, మరో ఇద్దరు నజీర్ అనుచరులు గాయపడ్డారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్క్రాబ్ లోడింగ్ విషయమై కొద్ది రోజుల క్రితం షాషా, నజీర్ మధ్య గొడవ జరిగింది. ఆదివారం స్థానిక మైదుకూరు రోడ్డులోని రిలయన్స్ పెట్రోల్ బంకు వద్ద నజీర్ పై షాషా కిరాయి వ్యక్తులతో దాడి చేయించినట్లు నజీర్ పోలీసులకు తెలిపారు. ఈ ఘటనలో స్థానిక శ్రీనివాస నగర్ ప్రాంతానికి చెందిన మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రొద్దుటూరు రూరల్ ఎస్సై రాజు విచారణ చేపట్టారు.