లోక్ అదాలత్ కేసులపై జిల్లా జడ్జీలతో సమావేశం.!
కడప: శ్రీ జి.రామ గోపాల్, చైర్మన్-కం-జిల్లా ప్రధాన న్యాయాధికారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కడప వారు
12-09-2026 వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ముందస్తు జాతీయ లోక్ అదాలత్ మీటింగ్ ను కడప యూనిట్ లో ఉన్న న్యాయమూర్తులతో గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి తన ఛాంబర్ నందు నిర్వహించడం జరిగినది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 12-09-2026 వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ నందు రాజీ కాగల కేసుల గురించి చర్చించడం జరిగినది. ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ అయ్యేవిధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేశారు.
W.P.No.116/2024, తేదీ: 26-11-2025 ప్రకారము గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఆదేశానుసారముగా ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించిన వారు వారిపై ఉన్న పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలానాలను రాబోయే జాతీయ లోక్ అదాలత్ లో అనగా 12-09-2026 వ తేదీన జరిగే గౌరవనీయ జాతీయ లోక్ అదాలత్ లో సెటిల్ చేసుకొని, సదరు జురడిక్షన్లో ఉన్న జాతీయ లోక్ అదాలత్ బెంచ్ లో కాంపౌండ్ చేసుకోగలరని ఉత్తర్వులు జారీ చేశారు అనే అంశాలను వివరించడం జరిగినది.
సమావేశంలో శ్రీమతి ఎన్.శాంతి మొదటి అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి, కడప, శ్రీ జి.ఎస్.రమేష్ కుమార్
IV అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి-కమ్-Spl. S.Cs and S.Ts (POA) చట్టం కింద కేసుల విచారణకు సెషన్స్ జడ్జి, కడప,
శ్రీ ఎం.శ్రీనివాసులు నాయక్ VI అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి-కమ్-జడ్జి, ఫ్యామిలీ కోర్టు, కడప, శ్రీ M.A.సోమ శేఖర్
లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం, 2012 (పోక్సో చట్టం) కింద నేరాల సత్వర విచారణకు ప్రత్యేక న్యాయమూర్తి, కడప, శ్రీమతి టి.ప్రతిమ మహిళలపై నేరాల విచారణకు VII అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి-కమ్-ప్రత్యేక కోర్టు, కడప,
శ్రీ షేక్ బాబా ఫక్రుద్దీన్ కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కడప, శ్రీమతి కె. ప్రత్యూష కుమారి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, కడప, శ్రీమతి జి.సి.ఆసిఫా సుల్తానా
అదనపు సీనియర్ సివిల్ జడ్జి, కడప, శ్రీ పి.కోటేశ్వరరావు
ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, కడప, శ్రీమతి మెల్లం రేష్మ
I అదనపు జూనియర్ సివిల్ జడ్జి, కడప, శ్రీ మధిర ఈశ్వర్ వెంకట ప్రసాద్ II అదనపు జూనియర్ సివిల్ జడ్జి, కడప
శ్రీమతి మున్నంగి ఆశా ప్రియ J.F.C.M. ప్రత్యేక మొబైల్ కోర్టు, కడప, శ్రీ పి. ముఖేష్ కుమార్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి, బద్వేల్, శ్రీమతి నూతనగంటి తేజస్విని
అదనపు జూనియర్ సివిల్ జడ్జి, రాయచోటి పాల్గొన్నారు.