పశువుల ఆరోగ్యంపై ఎల్నినో ప్రభావం: ప్రిన్సిపల్ శర్మ

జమ్మలమడుగు: ఎల్‌నినో వాతావరణ ప్రభావం పశువుల ఆరోగ్యం, సంరక్షణపై ఉంటుందని ప్రొద్దుటూరు వెటర్నరీ కళాశాల ప్రిన్సిపాల్ శర్మ తెలిపారు.  ఈ పరిస్థితుల్లో పశువుల సంరక్షణకు చేపట్టవలసిన చర్యలపై బుధవారం జమ్మలమడుగులో పశుశవర్ధకశాఖ సిబ్బందికి, రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.   
ప్రిన్సిపల్ శర్మ మాట్లాడుతూ.. వేసవి తీవ్రత పెరిగినప్పుడు పశువుల్లో వేడి ఒత్తిడి (Heat Stress) ఏర్పడి మేత తీసుకోవడం, పాల ఉత్పత్తి మరియు పశువుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు.
పశువులకు ఎల్లప్పుడూ స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉంచడం, తగినంత నీడ కల్పించడం, షెడ్లలో గాలి ప్రసరణ ఉండేలా చూడడం చాలా ముఖ్యమని అన్నారు. అలాగే పచ్చిమేత కొరతను అధిగమించేందుకు రైతులు ముందుగానే ఎండుగడ్డి, సైలేజ్ మరియు ఇతర పశుగ్రాసాలను నిల్వ చేసుకోవాలని సూచించారు.  ఎల్‌నినో పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని, తక్కువ నీటితో పెరిగే పశుగ్రాస పంటలను ప్రోత్సహించాలని ఆయన తెలిపారు. పశువులకు సమతుల్య పోషణ అందించడంతో పాటు ఖనిజ మిశ్రమాన్ని అవసరానికి అనుగుణంగా అందించాలని సూచించారు.
రైతులకు శాస్త్రీయ పశుపోషణ పద్ధతులపై అవగాహన కల్పించడంలో పారా వెట్స్ మరియు పశుసంవర్ధక శాఖ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని ప్రిన్సిపాల్ గారు పేర్కొన్నారు. పశువుల్లో వేడి ఒత్తిడి లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా పశువైద్యులను సంప్రదించాలని సూచించారు.
*ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డా. వీరబ్రహ్మయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ డా. శ్రీధర్ రెడ్డి, పశువైద్య కళాశాల ఎల్‌పీఎం విభాగానికి చెందిన డా. ఇందిర, డా. జ్యోతి, డా. సాయి కృష్ణ, డా. చరిత, డా. జాన్, డా. గాయత్రి, డా. మంజుల, పశుసంవర్ధక శాఖ అధికారులు, పశువైద్యులు, పారా వెట్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రొద్దుటూరు అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.. రూ.600 కోట్లతో UGD నిర్మాణం.!

అమ్మవారి మీద ఒట్టు.. నా మద్దతు మీకే:MLA వరద

యార్డులో పడగొట్టిన గోడ కట్టేదెవ్వరు.?