సిపిఐ ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలి: రామయ్య
ప్రొద్దుటూరు: రాష్ట్ర సీపీఐ ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలని జిల్లా కార్యవర్గ సభ్యులు రామయ్య పిలుపునిచ్చారు. గురువారం ప్రొద్దుటూరులోని సీపీఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు కడప నగరంలో తొలిసారిగా CPI రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంంబిస్తోందన్నారు. అధిక ధరలు, నిరుద్యోగం, కనీస వేతనాలు, పంటలకు నీటి వసతులు లేకపోకపోవడం, నూతన పరిశ్రమల ఏర్పాటులో అన్యాయం చేయడం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు. రాష్ట్రానికి కావలసిన నిధులను కేంద్రం నుంచి డిమాండ్ పెట్టి రాబట్టలేని దౌర్భాగ్య పరిస్థితి నేడు నెలకొని ఉందన్నారు. ఈదశలో రాష్ట్ర ప్రజానికానికి సిపిఐ ప్లీనరీ సమావేశాలు దిశ దశను చూపుతాయన్నారు.
ఈ సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పి సుబ్బరాయుడు, పట్టణ సమితి సభ్యులు ధనిరెడ్డి శివారెడ్డి, తదితరులు హాజరయ్యారు.