చంద్రబాబుతోనే బీసీల అభివృద్ధి.!
చంద్రబాబుతోనే బీసీల అభివృద్ధి సాధ్యమని ప్రొద్దుటూరు టిడిపి బీసీ నేతలు పేర్కొన్నారు. వారు శనివారం టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ల కోసం చంద్రబాబు చట్టం తీసుకువస్తున్నట్లు తెలిపారు. బీసీలకు రక్షణ, గుర్తింపు, అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబు హయంలోనే జరుగుతుందన్నారు. బీసీలంతా బాబు వెంటే ఉన్నారన్నారు.
సమావేశంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు చల్లా రాజగోపాల్, AMC చైర్మన్ లక్ష్మణ్ కుమార్, వక్ఫ్ బోర్డు డైరెక్టర్ జాకీర్, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నాగరాజు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చౌడం వెంకట కొండయ్య తదితరులు మాట్లాడారు.