పిర్యాదే ఆధారాలు లేవన్నారు: కమిషనర్
ప్రొద్దుటూరు మున్సిపల్ ఆర్ఐ రమేష్ పూజ స్కూల్ ఆస్తి యాజమాన్య మార్పిడికి రూ.20 లక్షలు ఎత్తాడని, మున్సిపల్ మార్కెట్ కలెక్షన్స్ స్వాహా చేశాడని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారెడ్డి గతనెల 3న మీడియా సమావేశంలో ఆరోపించారు. మరో మాజీ వైస్ చైర్మన్ ఖాజా మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ కు వ్రాతపూర్వక పిర్యాదు చేశారు.
*ఈ ఆరోపణలపై మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ గురువారం స్పందించారు. ఫిర్యాదుదారుడే రూ.20 లక్షల అవినీతి మీద ఆధారాలు లేవని నాతో స్వయంగా చెప్పారు. మార్కెట్ కలెక్షన్స్ విషయంలో విచారణ జరుగుతోంది. ఆరోపణలు నిరూపణ కాకుండానే ఉద్యోగిని సెక్షన్ నుండి బదిలీ చేశాం. అని కమిషనర్ వివరణ ఇచ్చారు. దీనిపై మాజీ వైస్ చైర్మన్లు బంగారెడ్డి, ఖాజా ఎలా స్పందిస్తారో.!.