లోక్ అదాలత్ లో కేసుల రాజీ.!
ప్రొద్దుటూరు: శనివారం జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ప్రొద్దుటూరు లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్ జడ్జి సత్యకుమారి మంగళవారం తెలిపారు. ఇరు పక్షాల రాజీపై కేసులు పరిష్కరించు కోవాలన్నారు. బ్యాంక్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ పరిహారం, ట్రాఫిక్ చలానా కేసులను రాజీ చేసుకోవచ్చన్నారు. కక్షిదారులు ఉపయోగించుకోవాలని సూచించారు.