బీసీ ముసాయిదా బిల్లు చర్చలో ముక్తియార్.!
విజయవాడలో శనివారం బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సవిత అధ్యక్షతన బీసీ రక్షణ రిజర్వేషన్ల ముసాయిదా బిల్లుపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ముక్తియార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని వివరించారు. బీసీల రక్షణకు ప్రభుత్వం సమగ్ర చట్టం తీసుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు.